- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్మీ జనరల్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల రహస్యాలను తెలుసుకునేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని అంటున్నారని. గత 11 సంవత్సరాలుగా భారతీయుల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని ఆరోపించారు.
- Advertisement -



