- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులు జరగడంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పేలుడు శబ్దాలు, యుద్ధ విమానాల మోతతో టెహ్రాన్ దద్దరిల్లింది. అటు ఇజ్రాయెల్ క్షిపణి హెచ్చరికలు జారీ చేయగా.. దుబాయ్, కువైట్ తమ వాయు రక్షణ వ్యవస్థల ద్వారా దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టం, ఖచ్చితమైన లక్ష్యాలపై ఇంకా స్పష్టత రాలేదు.
- Advertisement -



