Saturday, April 11, 2026
E-PAPER
Homeక్రైమ్ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
  • ఇద్దరు మృతి, ఒకరు తీవ్రంగా గాయాలు
    నవతెలంగాణ-భిక్కనూర్: ఎన్‌హెచ్ 44 హైవేపై రామేశ్వర్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం రాకాసిపేట్ గ్రామానికి చెందిన షేక్ సర్దార్ (33) అంబులెన్స్ నడుపుతుంటాడు. అదిలాబాద్‌కు చెందిన శైలనబాను(63) హైదరాబాద్‌లో చికిత్స అనంతరం అదిలాబాద్‌కు తీసుకెళ్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త హైపుల్లా ఖాన్ కూడా ఉన్నారు. రాత్రి సుమారు 12:45 గంటల సమయంలో రామేశ్వర్ పల్లి బ్రిడ్జ్ దగ్గర వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో షేక్ సర్దార్, శైలనబాను అక్కడికక్కడే మృతి చెందగా, హైపుల్లా ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలో మృతుడి భార్య నసీమ సుల్తాన్ ఫిర్యాదు మేరకు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానం అమలు…
ఈ కేసులో పోలీసులు ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అనుసరించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించిన అనంతరం అక్కడే ఫిర్యాదు స్వీకరించి, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఈ విధానం వల్ల కేసు నమోదు ఆలస్యం తగ్గి, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతమవుతుంది. బాధితులకు త్వరిత న్యాయం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఎస్ ఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -