Tuesday, February 10, 2026
E-PAPER
Homeఆటలుఘోర రోడ్డు ప్రమాదం.. షూటర్ శంభాజీ పాటిల్ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. షూటర్ శంభాజీ పాటిల్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఘోర రోడ్డు ప్రమాదంలో భారత అంతర్జాతీయ షూటర్ శంభాజీ పాటిల్ (27) దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా, ముంబై-అహ్మదాబాద్ హైవేపై శంభాజీ ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. 2016 జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం సాధించిన శంభాజీ, కేవలం 27 ఏళ్ల వయసులోనే మరణించడంతో భారత షూటింగ్ రంగం విషాదంలో నిండింది. ఈ ప్రమాదంలో ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -