Friday, February 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కాగా, వాటిని రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -