Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర కాంగ్రెస్‌కు పలు కీలక కమిటీలు

రాష్ట్ర కాంగ్రెస్‌కు పలు కీలక కమిటీలు

- Advertisement -

– ప్రకటించిన ఏఐసీసీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ)కి అధిష్టానం పలు కమిటీలను ప్రకటించింది. ఈమేరకు గురువారం ఏఐసీసీ ప్రకటించింది. రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్‌, ఎం. మహేశ్‌ కుమార్‌గౌడ్‌, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, చల్లా వంశీచంద్‌రెడ్డి, రేణుకాచౌదరి, బలరాం నాయక్‌, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, షబ్బీర్‌ అలీ, అజహరుద్దీన్‌, ఆది శ్రీనివాస్‌, శ్రీహరి ముదిరాజ్‌, బీర్ల ఐలయ్య, పి.సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, జెట్టి కుసుమకుమార్‌, ఈరవత్రి అనిల్‌తోపాటు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శు లు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు ఉంటారు. టీపీసీసీ డిలిమిటేషన్‌ కమిటీలో చల్లా వంశీచంద్‌రెడ్డి, గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పవన్‌ మల్లాడి, డి.వెంకన్న, టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీలో ఎంపీ మల్లు రవి, శ్యామ్‌ మోహన్‌, ఎం నిరంజన్‌రెడ్డి, బి కమలాకర్‌రావు, జాఫర్‌ జావిద్‌, జీవి రామకృష్ణ, 15 మంది నేతలతో టీపీసీసీ సలహా కమిటీని, 16 మంది తో సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -