Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి కుట్టు మిషన్ పంపిణి 

మృతుని కుటుంబానికి కుట్టు మిషన్ పంపిణి 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిక(కానా) వారి సహకారంతో తాడిచెట్టు పైనుండి పడిన కక్కెర్ల మహేష్ గౌడ్ కుటుంబనికి అండగా సోమవారం కుట్టు మిషన్ పంపిణి చేశారు. పస్రా రాంపూర్ కల్లు గీత సోసైటీకి చెందిన కక్కెర్ల మహేష్ గౌడ్ తన విధి నిర్వహణలో భాగంగా గత నెల 19న తాటి చెట్టు పై నుండి పడి చెయ్యి విరగడం జరిగింది ఈ విషయంపై కల్లుగీత  కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  రాష్ట్ర కమిటీకి తెలియజేయగా  కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి సహకారంతో మహేష్ గౌడ్ కుటుంబానికి అండగా కుట్టుమిషన్ ని పంపించడం జరిగింది.ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెబోయిన రవి గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ తాడి చెట్టు పైనుండి పడిన బాధిత కుటుంబాలకు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు సహకారాన్ని అందించడం అభినందనీయం అని అన్నారు.అలాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి రమణ బెల్లంకొండ వెంకటేశ్వర్లు,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ సహకారంతో బాధిత కుటుంబం ధైర్యంగా ఉండాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రంగు సత్యనారాయణ గౌడ్ మండల అధ్యక్ష కార్యదర్శులు రుద్రబోయిన మల్లేష్ గౌడ్ వత్సవాయి సారయ్య గౌడ్ పసర రాంపూర్ సొసైటీ అధ్యక్షులు జక్కు రాజు గౌడ్ మెరుగు సుధాకర్ గౌడ్ అన్నపురం ఉపేందర్ గౌడ్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -