Wednesday, March 18, 2026
E-PAPER
Homeజిల్లాలుకుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం

కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కాటారం: మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని గంగారం మోడల్ స్కూల్‌లో సర్పంచ్ బండం శోభారాణి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, సంఘ సభ్యులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ శోభారాణి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ త‌ర‌హా శిక్షణలు ఎంతో దోహ‌దం చేస్తాయ‌ని తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలు పొందడమే కాకుండా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవచ్చని పేర్కొన్నారు.ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -