Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాలికపై అతిథి ఉపాధ్యాయుడి లైంగిక‌దాడి..?

బాలికపై అతిథి ఉపాధ్యాయుడి లైంగిక‌దాడి..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఓ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదివే 11 ఏళ్ల విద్యార్థినిపై అతిథి ఉపాధ్యాయుడు లైంగిక‌దాడి చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు సోమవారం పాఠశాల ముందు ధర్నా చేశారు. ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు అతిథి ఉపాధ్యాయుడు ఇల్లు శుభ్రం చేయాలంటూ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక‌దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుడు వచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని మహిళలు పట్టుబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -