- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్‌లోని దర్బంగా జిల్లాలో శనివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై దుండగుడు లైంగికదాడి చేసి హత్య చేశాడు. బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి, చెరువు సమీపంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వికాస్ మహతో అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



