Sunday, May 18, 2025
Homeక్రైమ్దళిత బాలికపై లైంగికదాడి

దళిత బాలికపై లైంగికదాడి

- Advertisement -
  • – యూపీలో పాఠశాలకు వెళ్తుండగా ఘాతుకం
    సుల్తాన్‌పూర్‌: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో దళితులపై లైంగికదాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా సుల్తాన్‌పూర్‌లో 14 ఏండ్ల బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదో తరగతి చదువుతున్న బాధితురాలు స్కూల్‌కు వెళ్తుండగా, కారులో తీసుకెళ్తామంటూ 15 ఏండ్ల నిందితుడు ఆమెను పిలిచి కారులో ఎక్కించుకున్నాడు. మార్గంమధ్యలో మరో ఇద్దరు నిందితులు, ప్రదీప్‌ (18), సౌరభ్‌ (18) కారులో ఎక్కారు. నిందితులు ముగ్గురూ కలిసి ఆమెను ఒక గదికి తీసుకెళ్లి, కట్టివేసి, నోరు మూసి, అఘాయిత్యం చేశారని పోలీసులు తెలిపారు. గంట తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎఎస్‌పీ అఖండ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. ఇద్దరు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి, మరో నిందితుడైన 15 ఏండ్ల బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించినట్టు ఆయన చెప్పారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -