– సంఘం ద్వారా దేశానికి ఎంతో మంది నిష్ణాతులు
– లౌకిక తత్వంపై మాట్లాడితే యూనివర్సిటీల నుంచి సస్పెన్షన్
– శ్రమజీవుల పక్షాన నిలిచేది ఎస్‌ఎఫ్‌ఐ
– సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నితీశ్ నారాయణ్
– ముగిసిన 5వ రాష్ట్ర మహాసభలు
– 17 అంశాలపై తీర్మానాలు..
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం పునాదులపై నిర్మితమైన ఎస్‌ఎఫ్‌ఐ.. ఓ విశ్వవిద్యాలయం లాంటిదని ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు నితీశ్ నారాయణ్ తెలి పారు. కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని, సెక్యులరిజంపై మాట్లాడినందుకు స్కాలర్స్ ను యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తోందని చెప్పారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం (సీతారాం ఏచూరి నగర్)లో మూడు రోజులు కొనసాగిన ఎస్‌ఎఫ్‌ఐ 5వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నితీశ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ.. విద్యార్ధులకు ఎలా జీవించాలో.. ఎలాంటి వర్గ దృక్పథం కలిగి ఉండాలో నేర్పుతూ దేశానికి ఎంతోమంది నిష్ణాతులను ఇచ్చిందని తెలిపారు. జై భీమ్ చిత్ర ఇతివృత్తానికి సంబంధించిన జస్టిస్ చంద్రు ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన వారే కావడం గర్వకారణ మన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ ఎన్.రామ్.. ఎస్‌ఎఫ్‌ఐ మొట్ట మొదటి జాతీయ అధ్యక్షులని తెలిపారు. ఫ్యూడల్, పెట్టు బడిదారీ భావజాలా నికి వ్యతిరేకంగా శ్రమజీవుల పక్షాన ఈ సంఘం నిలబడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వా నికి వ్యతిరేకంగా మాట్లాడినా, విద్యార్థి సమస్యలపై ప్రశ్నిం చినా విద్యార్థి నేతలపై దేశద్రోహం కేసు నమోదు చేస్తున్నా రని తెలిపారు. లౌకికవాదంపై మాట్లాడినందుకు టీఐఎస్‌ఎస్ రీసెర్చ్ స్కాలర్ రాందాస్‌పై రెండేండ్లు వేటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్‌సీయూ భూములను కాజేస్తున్నారన్నారు. త్యాగధ నులు పుట్టిన గడ్డ ఖమ్మంలో మహాసభలు జరుగుతుం డటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యా కాషాయీకరణను వ్యతిరేకించాలి: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొ చ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. విద్యారంగంలో జ్యోతిష్యం, మూఢ విశ్వాసాలను చొప్పించి పాఠ్యపుస్తకాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో విద్యా, వైద్యం, ఉపాధి సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నేటికీ విద్యాలయాల్లో చాపకింద నీరులా కుల వివక్ష కొనసాగుతోందన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీ వివక్షతకు గురవుతున్నారన్నారు. అణచివేత, దోపిడీ, వివక్ష ఏ రూపంలో ఉన్నా వాటిని అంతం చేయాలనే సంకల్పంతో విద్యార్థి లోకం పోరాడాలని తెలిపారు. రాష్ట్రంలో జరుగు తున్న సామాజిక ఉద్యమాలకు విద్యార్థి లోకం బాస టగా నిలవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోయ చంద్రమోహన్, ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సీఐటీయూ నాయకులు కల్లూరు మల్లేష్, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకులు నాగేశ్వరరావు తదితరులు సౌహార్థ సందేశాలిచ్చారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్, నాగరాజు 61 మందితో నూతన కమిటీ, 15 మందితో కార్యదర్శివర్గం
ఖమ్మంలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 5వ రాష్ట్ర మహాసభల్లో 61 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా రజనీకాంత్ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా టి. నాగరాజు (ఖమ్మం) ఎన్నికయ్యారు. వీరితో కలిపి మొత్తం 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా అశోక్, పూజ, కిరణ్ (హైదరాబాద్), శంకర్ (రంగారెడ్డి), శ్రీకాంత్ (కరీంనగర్), శ్రీకాంత్ వర్మ (సూర్యాపేట), ప్రశాంత్ (మహబూబ్‌నగర్), సహాయ కార్యదర్శులుగా యార ప్రశాంత్ (వరంగల్), శంకర్ (నల్లగొండ), రంజిత్ రెడ్డి (సిద్దిపేట), దీపిక, మమత, ఆదిక్ (హైదరాబాద్) ఎన్నికయ్యారు.
ఆమోదించిన 17 తీర్మానాలు
ఎస్‌ఎఫ్‌ఐ ఐదో రాష్ట్ర మహాసభ మొత్తం 17 తీర్మానాలను ఆమోదించింది. నూతన జాతీయ విద్యావిధానం-2020 రద్దు చేయాలని, విద్యార్ధి సంఘం ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేశారు. రాష్ట్రంలో గురుకు లాలు, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి రెగ్యు లర్‌గా ఇవ్వాలని, మైనార్టీ హాస్టల్స్‌ను బలోపేతం చేయా లని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాల న్నారు. సాంకేతిక విద్యకు నిధులు పెంచాలని, ప్రొఫెష నల్ విద్యాసంస్థల్లో అక్రమ ఫీజులు అరికట్టాలని, రాష్ట్రం లో జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మా నించారు. జిల్లాకో ఇంజినీరింగ్ కళాశాల, నియోజక వర్గానికో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాల న్నారు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, ప్రయివేట్ యూనివర్సిటీలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. విద్యార్థినులపై లైంగికదాడులు, హత్యలను అరికట్టాలని తీర్మానించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. విద్యాశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి పీహెచ్‌డీ విద్యార్థికీ ఫెలోషిప్ ఇవ్వాలని, విద్యారంగంలో మత విద్వేషాలు వ్యతిరేకించాలని తీర్మానాలను సభ ఆమోదించింది.
ఎస్‌ఎఫ్‌ఐ ఓ విశ్వవిద్యాలయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES