నవతెలంగాణ-హైదరాబాద్: NCP అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారంపై సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ నిర్ణయం ఆమె పార్టీ స్థాయిలో తీసుకుని ఉండాలి. ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అంతర్గతంగా ఏదో నిర్ణయం జరిగి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల (NCP) విలీనంపై కూడా శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటువంటి పరిస్థితిలో ఎలా ముందుకు వెళ్లాలో అందరూ ఆలోచించాలి. ఎవరైనా బాధ్యత తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు.



