నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శరద్ పవార్ దగ్గు, త్రోట్ ఇన్వెక్షన్‌తో బాధపడుతూ పూణేలోని రూబి హాల్ క్లినిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన కూతురు, బారామతి ఎంపి సుప్రియో సూలే తెలిపారు. పరిస్థితి విషమించడంతోనే తరువాతి వైద్య పరిశీలన, సంరక్షణ కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం కూడా శరద్ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, దగ్గు ఎక్కువ అవ్వడంతో ఆస్పత్రిలో చేరగా ఆయనకు చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. చికిత్స అనంతరం గత శనివారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ తరవాత పవార్ రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రజల ముందుకు వస్తారని ప్రకటించారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించినందుకు శరద్ పవార్ సోషల్ మీడియా ద్వారా కఅతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు తిరిగి ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మరోసారి శరద్ పవార్‌కు అస్వస్థత
- Advertisement -
- Advertisement -



