నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అమెరికాకు చెందిన ద వాషింగ్టన్ పోస్టు దినపత్రికలో ఇషాన్ థరూర్ జర్నలిస్టుగా చేస్తున్నారు. ఆ సంస్థలో తాజాగా ఉద్యోగుల్ని తొలగించారు. మూడో వంతు అంటే సుమారు 300 మందిపై వేటు వేశారు. ఎడిటోరియల్ సిబ్బందికి చెందిన మూడో వంతు మందిని తొలగించడంతో ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జర్నలిజం భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారినట్లు ఆందోళనకు గురవుతున్నారు. వాషింగ్టన్ పోస్టు పత్రికకు చెందిన విదేశీ బ్యూరో, లోకల్ రిపోర్టింగ్ బృందాలు, స్పోర్ట్స్ డెస్క్, బిజినెస్ డివిజన్‌లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్.. ఆ పత్రికకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల్లో సీనియర్ కాలమిస్టుగా ఉన్నారు. తన ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని ఇషాన తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. చీకట్లో ప్రజాస్వామ్యం మరణిస్తుందని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ పోస్టును శశిథరూర్ మళ్లీ షేర్ చేశారు. బ్యాడ్ డే అంటూ పేర్కొన్నారు.
వాషింగ్టన్ పోస్టు దినపత్రికలో ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



