Wednesday, April 30, 2025
Homeసినిమావైభవంగా షష్టిపూర్తి టీజర్‌ విడుదల

వైభవంగా షష్టిపూర్తి టీజర్‌ విడుదల

రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో, హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్‌ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ చౌదరి నిర్మిస్తున్న చిత్రం షష్టిపూర్తి. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. టీజర్‌ మేస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా విడుదలైంది. దర్శకుడు పవన్‌ ప్రభ మాట్లాడుతూ, ఇంత గొప్ప వారు నా సినిమాకి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగి స్తోంది. నేను అదృష్టవంతుడిని అని అన్నారు. ఇంత మంది పెద్ద దిగ్గజాలతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలుః అని కథానాయకుడు, నిర్మాత రూపేష్‌ చెప్పారు. కీరవాణి మాట్లాడుతూ, ఇందులో ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. అనే పాట రాశాను. ఇళయరాజా సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది అని అన్నారు. రాజేందప్రసాద్‌ మాట్లాడుతూ, తన సంగీతంతోనే చాలామందిని హీరోలని చేసింది ఇళయరాజా సంగీతం. నాకు నట జీవితంలో షష్టిపూర్తి వచ్చింది. చక్కటి కథతో రూపొందిన సినిమా ఇదిః అని అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ, ఈ సినిమాకి నేను చేసిన వర్క్‌ మీరు విన్నారు… వినబోతున్నారు.. వింటూనే వుంటారు.. ఆ నమ్మకం వుంది. దేవుడు ఈ సినిమాకి, ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఆశీస్సులు అందించాలి. లాంగ్‌ లైఫ్‌ ఫేమ్‌ ఇవ్వాలని కోరుకుంటున్నానుః అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img