Wednesday, May 7, 2025
Homeసినిమా'షష్టి పూర్తి' రిలీజ్‌కి రెడీ

‘షష్టి పూర్తి’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమాతో పవన్‌ ప్రభ దర్శకునిగా పరిచయమవుతున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకం పై రూపేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు పవన్‌ ప్రభ ,రూపేష్‌ మాట్లాడుతూ, ‘అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్‌, అర్చన ఈ సినిమాకు మెయిన్‌ అస్సెట్‌. ఇక ఇళయరాజా స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్‌ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు టాప్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఏదో ఏ జన్మలోదో ..’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి సాహిత్యం అందించడం మా అదష్టం. రెహమాన్‌ రచించిన ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె’ పాటను ఎస్పి చరణ్‌, విభావరి ఆలపించారు. ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఈ పాటల కారణంగా ప్రేక్షకుల్లోనే కాకుండా, బిజినెస్‌ సర్కిల్స్‌లో కూడా మా సినిమాపై స్పెషల్‌ అటెన్షన్‌ వచ్చింది. అలాగే ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌కి కూడా సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అవుట్‌ పుట్‌ కూడా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఈ సమ్మర్‌కి మంచి ఫీల్‌ గుడ్‌ మూవీతో వీడ్కోలు చెప్పవచ్చు. మిగిలిన 3 పాటలను, ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -