- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన మరణశిక్షను మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వ తీర్పును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.
- Advertisement -



