Sunday, July 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంషేక్ హ‌సీనాను క‌ట్ట‌డి చేయాలి: ముహమ్మద్ యూనస్

షేక్ హ‌సీనాను క‌ట్ట‌డి చేయాలి: ముహమ్మద్ యూనస్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు.తాజాగా లండన్‌లోని చాఠమ్‌ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనస్‌ మాట్లాడారు. భారత్‌లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని ప్రధాని మోడీని అడిగితే అందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. హసీనాను కట్టడి చేయాలని కోరగా అందుకు కూడా అంగీకరించలేదని వెల్లడించారు.

బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని మోడీతో షేక్ హసీనా గురించి మాట్లాడానని.. ఆన్‌లైన్‌లో హసీనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని తెలియజేసినట్లు చెప్పారు. ఆమె ప్రకటనలు, ప్రసంగాలు అడ్డుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అందుకు మోడీ.. అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని చెప్పినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -