గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశాలు ఆరోగ్యం
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి : సిద్దిపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ-కోహెడ, సిద్దిపేట
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉద్యమం (ఎస్‌హెచ్‌జీ) మహిళా సాధికారత ఉద్యమమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబురాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 38 వీవోఏలకు స్టీల్ బ్యాంకులను పంపిణీ చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పేరు మీద పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నానని చెప్పినపుడు.. చాలా సంతోషంగా అనిపించిందన్నారు. గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని, నేటికీ అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన అందాల పోటీలు సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన భోజనం కార్యక్రమ సమయంలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమం గురించి మంత్రి పొన్నం చెప్పారని గుర్తుచేశారు. స్టీల్ బ్యాంక్ ప్రభావం ఆటోమొబైల్, ఐటీ విప్లవం కంటే గొప్పదని అభివర్ణించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పరిసరాలు పచ్చదనాన్ని కోల్పోతాయని తెలిపారు. ప్రతి మహిళా.. నాయకురాలుగా ఎదగాలని కోరుతున్నానన్నారు. స్టీల్ బ్యాంక్ రానున్న రోజుల్లో తెలంగాణలో ఊపందుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి మహిళల శక్తి సామర్థ్యాలు చూశానని అన్నారు. మానవసేవ చేయాలని సంకల్పించిన ప్పుడు అదొక ఉద్యమంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకయ్య, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, దాన కిషోర్, కలెక్టర్లు హైమావతి, పమేలా సత్పతి, స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌హెచ్‌జీ.. మహిళా సాధికారత ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES