- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చెల్లింపులు చేసేవారికి చేదువార్త. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థలైన ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ ఈ సేవలను నిలిపివేశాయి. ఆర్‌బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్‌ను వినియోగిస్తున్నారు. నగదు కొరత ఉన్న సందర్భాల్లో దీనిని ఉపయోగించుకొని క్రెడిట్ కార్డు ద్వారా మరో అకౌంట్‌కు సొమ్ము బదిలీ చేసి.. అక్కడి నుంచి నగదు పొంది తమ అవసరాలు తీర్చుకుంటున్నారనేది అసలు నిజం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ కారణంగా ఈ సేవలకు బ్రేక్ పడింది.
Rent payment
- Advertisement -