Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు షాక్.. పరీక్షల్లో పాస్ మార్క్ 45..!

విద్యార్థులకు షాక్.. పరీక్షల్లో పాస్ మార్క్ 45..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణలో విద్యా సంస్కరణలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్ పెట్టారు. పది పాస్ మార్కులను 35 నుంచి 45కు, ఉన్నత విద్యలో 50%కు పెంచాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. 11వ తరగతి బోర్డు రద్దు, EAPCET రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు, RTE వయోపరిమితి 3–18 ఏళ్లకు విస్తరణ వంటి కీలక సూచనలు ఉన్నాయి. ఉపాధ్యాయుల పనితీరు మూల్యాంకనం, ఇంగ్లీష్ మీడియం, త్రిభాషా సూత్రం అమలు ప్రతిపాదించారు. 2027 నుంచి దశలవారీగా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -