- Advertisement -
నవతెలంగాణ – హైదారాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంఘటనాస్థలిలో మూడు తుపాకులు లభించాయి. మృతుల నుదిటిపై తూటాల గుర్తులు కనిపించాయి. కుటుంబ యజమాని అశోక్ అప్పులు లేదా కుటుంబ సమస్యల కారణంగా ముందుగా కుటుంబ సభ్యులను కాల్చి చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



