Wednesday, February 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకోఠిలో కాల్పులు.. ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్

కోఠిలో కాల్పులు.. ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున తీవ్ర కలకలం రేపిన కోఠి కాల్పుల దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జనవరి 31న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న అంతరాష్ట్ర ముఠాలోని ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మంగళవారం వెల్లడించారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని తెలిపారు. అరెస్టయిన వారిని యూపీకి చెందిన ఫుర్ఖాన్ అహ్మద్ (36), తయ్యబ్ త్యాగి (30)గా గుర్తించారు. తయ్యబ్ త్యాగి నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ షాహీన్ నగర్‌లో నివసిస్తున్నాడు. వారి నుంచి ఒక దేశీయ తుపాకీ, 35 బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు, రూ. 2.38 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఫహీమ్ అహ్మద్, నౌషాద్, అబిద్, డానిష్ త్యాగి, మహ్మద్ మత్లుబ్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -