- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. బ్రూక్లిన్‌లోని ఈస్ట్ విలియమ్స్బర్గ్ ప్రాంతంలో గ్యాంగ్ వార్ సమయంలో జరిగిన కాల్పుల్లో ‘స్ట్రే బులెట్’ అనే చిన్నారి తలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో చిన్నారి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
- Advertisement -



