Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంకాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం

కాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ :న్యూయార్క్ లో కాల్పులు కలకలం సృష్టించింది. అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 6.30కి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌ లోని 345 పార్క్ అవెన్యూలో ఎన్ఎఫ్ఎల్, బ్లాక్‌స్టోన్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆఫీసులు ఉన్న స్కైస్క్రాపర్‌లో ఓ గన్‌మెన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ఒక పోలీసు అధికారి పాటు అనుమానితుడితో సహా ఐదుగురు మరణించినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి తనకు తానుగా గన్ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పెట్టుకుని కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్‌వైపీడీ కమిషనర్ జెస్సికా టిష్ మాట్లాడుతూ.. ఒక లాంగ్ రైఫిల్‌ క్యారీ చేసిన గన్‌మన్‌ కాల్పుల జరిపినట్లుగా గుర్తించామని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. కాల్పులుపై న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘X’ వేదికగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోస్ట్ చేశారు. ప్రస్తుతం మిడ్‌టౌన్‌లో యాక్టివ్ షూటర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని అన్నారు. ఎవరైనా పార్క్ అవెన్యూ, ఈస్ట్ 51 స్ట్రీట్ సమీపంలో ఉంటే, తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లవద్దని ఎరిక్ ఆడమ్స్ ట్వీట్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad