- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతి చెందారు. మృతులను మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీశ్ చందర్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడైన విజయ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
- Advertisement -



