- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని మిసిసిపి రాష్ట్రం క్లే కౌంటీలో నిన్న జరిగిన వరుస కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ పాయింట్ సమీపంలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో ఈ దారుణం జరిగింది. నిందితుడు డారికా మూర్(24) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిపై హత్య కేసులు నమోదు చేశారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



