- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. సెంట్రల్ మెక్సికోలోని సాకర్ మైదానంలో ఆదివారం దుండగులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 11మంది మరణించగా, 12మందికి గాయాలయ్యాయని అన్నారు. సాకర్ మ్యాచ్ ముగుస్తుండగా దుండగులు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపారని సాలమాంకా మేయర్ సీజర్ పిట్రో సోషల్‌మీడియాలో తెలిపారు. ఘటనా స్థలంలో పది మంది, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారని అన్నారు. గాయపడినవారిలో ఒక మహిళ, మైనర్ ఉన్నారని చెప్పారు.
- Advertisement -



