- Advertisement -
– జన్ను కిరణ్ కుమార్ జిల్లా డ్రాగ్ ఇన్స్పెక్టర్ (ఇంచార్జ్)
నవతెలంగాణ-గోవిందరావుపేట : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ షాపులను నిర్వహించాలని ములుగు జిల్లా ఇన్చార్జి డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని చల్వాయి గోవిందరావుపేట గ్రామాలలో నిర్వహిస్తున్న పలు ఔషధ షాపులను కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బిల్స్, రికార్డ్ లను పరిశీలించి లోపాలు ఉన్నవారికి ఫస్ట్ వార్నింగ్ గా హెచ్చరించారు. వర్క్ రాకపోతే నేర్చుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా షాపులను నిర్వహించాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. ఔషధాల విలువ చేస్తున్న విధానం తదితర అంశాలను కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
- Advertisement -



