Saturday, May 17, 2025
Homeకరీంనగర్సమాజ సేవలో ముందు ఉండాలి..

సమాజ సేవలో ముందు ఉండాలి..

- Advertisement -

– రిటైర్డ్ ఆర్ అండ్ బి అదనపు కార్యదర్శి తుమ్మ.
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : సమాజ సేవలో ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు,యువత ముందుండాలని రిటైర్డ్ ఆర్ అండ్ బి అదనపు కార్యదర్శి తుమ్మ రామస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగమ్ గౌడ్  అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ క్లబ్ నూతన పాలకవర్గ అభినందన సభ శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ఐబి అదనపు కార్యదర్శి తుమ్మ రామస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరల నరసింహం గౌడ్, మాజీ ఎంపీపీ పడిగల మానసలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఆదర్శ యూత్ క్లబ్ గ్రామానికి కాకుండా మండలానికి ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నో సమాజ సేవలో పాటు వైద్య శిబిరాలను, రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వృద్ధులకు కంటి వైద్య పరీక్షలను కూడా చేయించారన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం అధ్యక్షులు బాల్సాని పరశురాములు గౌడ్, ఉపాధ్యక్షులు సుద్దాల కరుణాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మోర శ్రీకాంత్, కోశాధికారి కోడం శ్రీధర్, సహాయ కార్యదర్శి అడ్డగట్ల ప్రవీణ్, సాంస్కృతిక కార్యదర్శి జిందం సంతోష్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన పాలకవర్గం ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, కాంగ్రెస్ సేవాలాల్ జిల్లా అధ్యక్షులు మోర రాజు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని లింగారెడ్డి, మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, మాజీ అధ్యక్షులు ఇటుకల మహేందర్, ఎడమల బాల్రెడ్డి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -