అధికారులు హెడ్ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లొద్దు
ఆగస్టు మొదటి వారంలో స్పెషల్ డ్రైవ్ : పీఆర్ ఆర్డీ సమీక్షాసమావేశంలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామాల్లో పచ్చదనం-స్వచ్ఛదనం పెంచేలా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశాలు జారీ చేశారు. భారీవర్షాలతో గ్రామీణ రహదారులు దెబ్బతినే ప్రమాదమున్నందున సత్వరమే పునురుద్ధరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్య పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ప్రధాన కార్యాలయంలో డీఈ, ఎస్‌ఈలతో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పీఆర్‌ఆర్డీ శాఖపై మంత్రి సీతక్క అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై ఆరా తీశారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య, గ్రామీణ రోడ్లు, ప్లాంటేషన్‌పై సమీక్ష నిర్వహించారు. వనమహెత్సవం కార్యక్రమంలో వేగం పెంచాలని సూచించారు. మిషన్ భగీరథ పైప్ లైన్లను నిత్యం పరిశీలించాలనీ, వర్షాలు, వరదలతో పైప్‌లు లీకైతే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదమున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగు నీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి రోజు నివేదికలు పంపాలని ఆదేశించారు. సమీక్షలో పీఆర్‌ఆర్డీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, డైరెక్టర్ జి.సృజన, ఈఎన్సీలు కృపాకర్‌రెడ్డి, ఎన్.అశోక్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES