- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెటర్ నసీం షా, పంజాబ్ సీఎం మరియం నవాజ్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం మరియం నవాజ్ కు లభించిన గౌరవంపై నసీం షా తన ఎక్స్ ఖాతాలో ‘లార్డ్స్ లో రాణిలా, ఇక్కడిలా ఈమెను ఎందుకు చూస్తున్నారు? ఎందుకింత హడావుడి?’ అని పోస్ట్ చేశారు. అయితే, తన ఖాతా హ్యాక్ అయిందని, తాను ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని నసీం షా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్, మీడియా నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీం షాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
- Advertisement -



