Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలి 

వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలి 

- Advertisement -

-ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో  వందేమాతరం గేయం150 వసంతాలు పూర్తి 
నవతెలంగాణ-తలకొండపల్లి
వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాల అని గ్రామ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు ఎ. యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బస్టా ఎదుట వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాల అని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాను  చేతభూని మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఫ్రెండ్స్  యూత్ అధ్యక్షులు ఎ. యాదయ్య మాట్లాడుతూ ప్రతీ పౌరుడు ఆలపించాల్సిన సందర్భం వందేమాతరం అని ఊపిరి తీసిన ప్రతి సవ్వడి, భూమాత గర్భం నిండా ఝంఝావాతంలా మ్రోగిన శక్తి అయ్యింది.వందేమాతరం అని కదిలిన ప్రతీ నరం,బానిస బంధాలు విప్పి,  బ్రిటీష్ మూకల పాలక సింహాసనాల్ని వణికించింది.దేశంలో పసి పిల్లల నోట,పలికే రణ నినాద గీతమై,పోరాట యోధుడి గొంతులోస్వేచ్ఛ కాంక్ష  సింహ గర్జ నైతల్లిని వందనం అన్నఈ మహోన్నత జాతీయ నాదం,భారత జాతిని ఒక్కటి చేసిన నినాదం.జైలు గోడల వెంబడి ఆ స్వరం ప్రతిధ్వనిస్తే ఆంగ్లేయుడి గుండె గదులు కంపించినయి.రక్తంతో రాసినా, చిరునవ్వుతో పలికినా వందేమాతరం, వందేమాతరం పురవీధుల గుండా స్థానిక గ్రామపంచాయతీ, పాఠశాలలను కలుపుకొని స్థానిక పెద్దలు యువజన సంఘాలను కలుపుకొని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడిలో భారతీయతా  భావం పెంపొందించుకోవాలని  ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు ఎ. యాదయ్య, ఉపధ్యక్షులు గిరిందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మల్లేష్, పంచాయతీ సెక్రెటరీ సత్యం, సింగల్ విండో డైరెక్టర్ కటికల శేఖర్, మోహన్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లేష్, పద్మ, అనిల్,కోటీశ్వర్, దశరథం, రమేష్, మహేష్, యాదయ్య, విద్యార్థులు విద్యార్థినిలు గ్రామ ప్రజలు,గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -