నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాల్గవ వార్డులో శ్రమ దాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రమణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని వార్డులలో సర్పంచ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన శ్రమదానం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి శ్రమదానం నిర్వహించి గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని మస్తులకు సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ సర్పంచ్ వి. రమణ సురేష్ గొండ, పంచాయతీ కార్యదర్శి భారద్వాజ, ఉప సర్పంచ్. బి. అనిల్ కుమార్, మల్టీపర్పస్ కార్మికులు, ఎం గంగారం, జి. కిషన్, జి. యశ్వంత్, మారుతి గొండ, నాగగొండ , తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రుద్రపహాడ్.. కమ్యూనిటీ ప్లాంటేషన్లో ఈరోజు వాటర్ డే లో సర్పంచ్ పాల్గొనడం జరిగింది.
బస్వాపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రమదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



