నవతెలంగాణ-హైదరాబాద్ : పెట్రోలియం మరియు సహజ వాయువుల గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ హర్దీప్ సింగ్ ఈ రోజు, విప్లవాత్మకమైన యాక్టివ్ టెక్నాలజీ పెట్రోలును జియో-బిపి (రిలయెన్స్ ఇండస్ట్రీస్ మరియు బిపి వారి జాయింట్ వెంచర్ అయిన రిలయెన్స్ BP మొబిలిటీ లిమిటెడ్ (RBML))ని, గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2026 సందర్భంగా లాంచ్ చేశారు. జియో-బిపి వద్ద యాక్టివ్ టెక్నాలజీ కలిగిన పెట్రోలును కీలకమైన ఇంజన్ భాగాలను శుభ్రం చేసేందుకు, పటిష్టమైన క్లీన్-అప్ సామర్ధ్యాన్ని అందించేందుకు, ఇంజన్ సామర్ధ్యాన్ని పునరుద్ధరించేందుకు మరియు కాపాడేందుకు, సాధారణ పెట్రోలుతో పోలిస్తే ప్రతి సంవత్సరం అదనంగా 100 కిమీల* వరకు వెళ్ళగలిగేందుకు మోటరిస్టులకు సహకరించేందుకు డిజైన్ చేయబడినది. ఇదంతా, ఎటువంటి అదనపు ధరను చెల్లించకుండా పొందవచ్చు.
వినియోగదారులకు లాభాలు:
జియో-బిపి వద్ద యాక్టివ్ టెక్నాలజీ కలిగిన పెట్రోలును, ప్రతిరోజూ డ్రైవ్ చేసేవారు ఎక్కువ జాగ్రత్త వహించే విషయాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించటం జరిగింది: ట్యాంకు నింపిన ప్రతి సారి మరింత స్మూత్ రైడ్లు, మరిన్ని ఎక్కువ కిలోమీటర్లు, ఇవన్నీ ఎటువంటి అదనపు ధరను చెల్లించకుంటానే లభిస్తాయి. పైగా, శుభ్రమైన ఇంజన్‌ను పరిరక్షిస్తుంది మరియు మెయింటెయిన్ చేస్తుంది.
కీలకమైన వ్యత్యాసాలు
· కీలకమైన ఇంజన్ భాగాల్లో పేరుకుపోయిన పదార్ధాలను శుభ్రం చేస్తుంది, ఇంజన్లు మరింత బాగా పని చేసేందుకు, స్మూత్‌గా నడిచేందుకు సహకరిస్తుంది
· బలమైన క్లీన్-అప్ పనితీరును అందిస్తుంది, క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే, ఇంజన్లు శుభ్రంగా ఉండేందుకు, దీర్ఘకాలం విశ్వసనీయంగా నిలుస్తుంది
· ఙభారతదేశపు ద్విచక్ర మరియు నాలుగు-చక్రాల వాడకందార్లకు, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఏడాదికి అదనంగా 100 కిమీల* వరకు దూరం డ్రైవ్ చేయటంగా మారగలదు
· ఆవిర్భవిస్తున్న భారతదేశపు డైనమిక్ ఇంధనపు ప్రమాణాలతో అనుసంధానమవుతుంది
· మెయింటెనెన్సును తగ్గిస్తుంది
బిపి వారి 100 సంవత్సరాల అంతర్జాతీయ ఇంధన పరిశోధనా లీడర్షిప్ ఆధారంగా తయారు చేయబడిన, జియో-బిపి వద్ద యాక్టివ్ టెక్నాలజీ కలిగిన అధిక పెర్ఫార్మెన్స్ పెట్రోల్ పై, భారతదేశపు ఇంజన్ ల్యాండ్స్కేపుకు అనుగుణ్యమైన పరిశ్రమ ప్రమాణ పరీక్షలు మరియు తయారు చేయబడిన పద్ధతులు రెండింటినీ వాడి విస్తృతమైన అభివృద్ధి మరియు వాలిడేషన్లను నిర్వహించటమైనది. వాస్తవ ప్రాపంచిక పరిస్థితుల్లో, శుభ్రపరచటంలో దీని సామర్ధ్యాన్ని నిరూపించేందుకు, జియో-బిపి ఒక మోటార్సైకిలును 4,000 కిమీల కంటే ఎక్కువ దూరం కోయంబత్తూరులోని టెస్ట్ ట్రాక్ పై నడిపి, ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రేక్షకుల సమక్షానికి ఒక ఆకర్షణీయమైన ప్రదర్శన నిర్వహించింది.
పేరుకున్న పదార్ధాన్ని తొలగించటం వలన, వాహనం పనితీరు, విశ్వసనీయత, స్మూత్ ఆపరేషన్ల పై ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. జియో-బిపి లోని యాక్టివ్ టెక్నాలజీ కలిగిన పెట్రోలు వినియోగానికి సంబంధించిన సాధ్యమైన లాభాలను సాధించేట్లు చేస్తుంది. భారతీయ ద్విచక్ర మరియు నాలుగు-చక్రాల వాహనాల వార్షిక సగటు మైలేజ్ ఆధారంగా ఈ మెరుగుదల, ఏడాదికి 100 కిమీల* వరకు లాభంగా మారగలుగుతుంది.
ఈ విప్లవాత్మకమైన ఉత్పత్తిని గురించి మాట్లాడుతూ జియో-బిపి ఛెయిర్మన్ సార్థక్ బెహూరియా, ఇలా అన్నారు: “భారతీయ మోటరిస్టులు, సరళమైన, వాస్తవప్రపంచపు లాభాలు – స్మూత్‌గా నడిచే, విశ్వసనీయమైన, మెయింటెనెన్సును తగ్గించే, అంతే ఇంధనాన్ని ఖర్చు చేసి ఎక్కువ కిలీమీటర్లు మైలేజ్‌ను ఇచ్చే ఇంజన్‌కు విలువనిస్తారు. జియో-బిపి యాక్టివ్ టెక్నాలజీతో, మీరు డ్రైవ్ చేస్తూండగా చురుగ్గా ఇంజన్‌ను శుభ్రం చేసే, ప్రమాదకరమైన పదార్ధాలు పేరుకున్న ప్రభావాన్ని తొలగించేందుకు సహకరించే పెట్రోలును మేము ఆఫర్ చేస్తున్నాము. ఉత్తమమైన పనితీరు కలిగిన ఇంజన్ క్లీన్-అప్ను ఒక స్థిరమైన ఆఫరింగుగా చేయటం ద్వారా, భారతదేశవ్యాప్తంగా కస్టమర్లకు లాభావు ప్రతిరోజు లభించేలా చూడటం ద్వారా అధునాతనమైన ఇంధన పరిజ్ఞానాన్ని సార్వజనీనం చేయటం మా లక్ష్యం.”
అంతే కాక, జియో-బిపి CEO, అక్షయ్ వాధ్వా ఇలా అన్నారు: “నేడు గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026లో, రెండు మోటర్ సైకిళ్ళను పక్క పక్రనే ఉంచి ప్రదర్శించటం జరిగింది. ఒకటి యాక్టివ్ టెక్నాలజీ పెట్రోలు పై నడిచినది కాగా, మరొకటి సాధారణ పెట్రోలు పై నడిచినది. అధునాతనమైన బోర్స్కోప్ ఇమేజింగును ఉపయోగించి చూసినప్పుడు, యాక్టివ్ టెక్నాలజీ పెట్రోలు యొక్క క్లీన్-అప్ సామర్ధ్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇంధన రసాయనశాస్త్రంలో ఐదు సంవత్సరాలు నిరంతరం శ్రమించిన తర్వాత ఈ పెట్రోలు, ఇంధన సామర్ధ్యాన్ని పెంచటం మాత్రమే కాక, మెయింటెనెన్సును కూడా తగ్గిస్తుంది. యాక్టివ్ టెక్నాలజీ పెట్రోలు కలిగిన మోటార్సైకిలును కోయంబత్తూరు టెస్టింగ్ ట్రాక్ పై 4,000 కిమీలు నడపటం జరిగింది. ఈ మెరుగుదలలు, ఏడాదికి 100 కిమీల* వరకు లాభంగా మారాయి. విజ్ఞానశాస్త్రం వలన కలిగే మార్పు ఇది. వీటితోపాటు లాయల్టీ లభాలు, ఇటీవలే విడుదల చేసిన జియో-బిపి మొబిలిటీ+ క్రెడిట్ కార్డ్, వినియోగదారుని కోసం మరల మరల లాభాలను కొనితెస్తుంది.”
ఇండియా ఎనర్జీ స్టాండ్ వద్ద, జియో-బిపి, ఎలక్ట్రిక్ వాహనపు చార్జింగ్ సొల్యూషన్లు, మెరుగుపరిచిన కన్వీనియన్స్ ఆఫరింగులు, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్), గుమ్మం వద్దకే డీజిల్ డెలివరీ మరియు వర్తమాన మరియు భవిష్యత్తుకు అనుకూలమైన వాయురూపంలోని ఇంధనాలతో సహా ఒక సమగ్రమైన అసెట్‌ను మరియు సర్వీస్ పోర్ట్‌ఫోలియోను ఇప్పటికే షోకేస్ చేసింది. తక్కువ కార్బన్ మొబిలిటీ సొల్యూషన్లను వ్యాపింపజేస్తూ, పరిశ్రమలో ఉన్న ప్రమాణాలకు మించి ప్రతి యూనిట్ శక్తికి మరింత విలువను స్థిరంగా అందజేస్తూనే, కొత్తగా ఆవిర్భవిస్తున్న ప్రతి శక్తిని భారతీయ రీటెయిల్ మార్కెట్‌కు తీసుకురావాలన్న ఈ పరిపుష్ఠమైన స్పష్టమైన విజన్ జియో-బిపి వారిది.



