Monday, May 5, 2025
Homeసినిమా'శుభం' రిలీజ్‌కి రెడీ

‘శుభం’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతూ, ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై తొలి చిత్రంగా ‘శుభం’ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుద లవుతోంది. ఈ క్రమంలో రిలీజ్‌ చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే మేకర్స్‌ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్‌ ‘జన్మ జన్మల బంధం’ను విడుదల చేశారు.
ఇది ప్రమోషనల్‌ వైబ్‌ కోసం రూపొందించి ఓ ఎనర్జిటిక్‌ రీమిక్స్‌ పాట. నిర్మాతతో పాటు ప్రధాన తారాగణం ఈ ప్రమోషనల్‌ సాంగ్‌లో కనిపిస్తారు. ఈ సాంగ్‌లో సమంత అందరి దష్టిని ఆకర్షించేలా ఉన్నారు. టీం అంతా కూడా ఫుల్‌ వైబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ బీట్‌ చాలా హుషారుగా ఉంది. నవ్వు, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను ఇందులో పొందు పర్చారని విషయం ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, క్లింటన్‌ సెరెజో సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్‌ గౌడ్‌ తదితరులు నటించారు. 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ఈ వేసవికి ప్రేక్షకులను పూర్తిగా సంతప్తిపరిచే చిత్రం కానుంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -