నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి క్షేమంగా దిగారు ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. 2025, జూలై 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వీరి స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 22 గంటల ప్రయాణం తర్వాత భూమికి సురక్షితంగా తిరిగివచ్చింది. శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కపు కూడా శుభాంశు శుక్లాతో ఉన్నారు.యాక్జియం-4 (Axiom-4) మిషన్ లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్.. క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. మంగళవారం (జులై 15) మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా లోని శాన్ డియాగో తీరంలో లాండ్ అయ్యింది. 20 రోజుల మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా ఆధ్వర్యంలో యాత్ర, పరిశోధనలను పూర్తి చేసుకుని శుభంగా, క్షేమంగా భూమికి చేరుకున్నారు.
భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES