నవతెలంగాణ-మల్హర్‌రావు
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన అడ్డురి చిన్నయ్య స్మారకార్థం మండల స్థాయి షటిల్ టోర్నమెంట్‌ను ఆయన కుమారులు అడ్డురి వెంకటేష్,శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ అందజేశారు. ప్రథమ బహుమతి పెద్దతుండ్ల గ్రామనికి చెందిన టీం బోయిన దేవేందర్,బండ అన్వేష్, ద్వితీయ బహుమతి తాడిచెర్ల గ్రామానికి చెందిన టీం బొంతల రాజైల్, కోట నరేష్ లకు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బియ్యని రాజమౌళి,తాటికొండ కేశవ్ చారి,జంబోజు సంధ్యారాణి-రవిందర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,కిషన్ నాయక్,బోయినీ రాజయ్య,కొలిపాక కోటేష్,నరేష్,యూత్ అజ్మీరా దేవేందర్,సతీష్ ,మందపల్లి అంజి,అన్వేష్,అనిల్ పాల్గొన్నారు.
అడ్డూరి చిన్నయ్య స్మారకార్థం షటిల్ టోర్నమెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



