నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ ఉద్యోగాలతో ప్రతిభను కనబరిచిన శ్యాం కుమార్ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి చెన్నూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు. మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన నారగోని శ్యాం కుమార్ మండల పంచాయతీ అధికారి ఎంపీవోగా గ్రూప్ 2 ఫలితాల్లో 316 ర్యాంకును సాధించాడు. 2019 డిగ్రీ పూర్తి చేసిన శ్యాం కుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు.గ్రూప్-డి (రైల్వే).ఎక్సైజ్ కానిస్టేబుల్ గా . ప్రస్తుతం గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ (రెవెన్యూ డిపార్ట్మెంట్),గ్రూప్ – 3 (సెలెక్టెడ్),గ్రూప్ -2 (ఎం.పి.ఓ) మండల్ పంచాయతీ ఆఫీసర్ గా ఎంపికయ్యారు.గ్రూప్ 2 లో 316 ర్యాంక్ సాధించి చెన్నూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాడు. ఐదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతివను కనపరిచిన శ్యామ్ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు.
ప్రభుత్వ ఉద్యోగాలతో ప్రతిభను కనబరిచిన శ్యామ్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES