Wednesday, July 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగ‌పూర్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగ‌పూర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జూలియస్‌ బేర్‌ వార్షిక నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్‌ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను సింగపూర్‌ దక్కించుకోవడం విశేషం. మరోవైపు రెండో స్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని లండన్‌ కైవసం చేసుకుంది. హాంగ్‌కాంగ్‌ మూడో స్థానానికి పరిమితమైంది.

కనీసం 1 మిలియన్‌ డాలర్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులు, వారు అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా.. వారి జీవన వ్యయాన్ని జూలియస్‌ బేర్‌ లైఫ్‌స్టైల్‌ ఇండెక్స్‌ విశ్లేషించి.. ఈ నివేదికను తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు జూలియస్‌ బేర్‌ వెల్లడించింది.

టాప్‌ 10 ఖరీదైన నగరాలు ఇవే:

  1. సింగపూర్‌ 2. లండన్‌ 3. హాంగ్‌కాంగ్‌ 4. షాంఘై 5. మొనాకో 6. జ్యూరిచ్‌ 7. న్యూయార్క్‌ 8. పారిస్‌ 9. సావో పౌలో 10. మిలాన్‌.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -