నవతెలంగాణ-సత్తుపల్లి : కొత్తగా ఏర్పాటైన సత్తుపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజరుగా బాధ్యతలు చింతల శ్రీనివాస్ సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా జీఎం శ్రీనివాస్ ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తో ముచ్చటించారు. సత్తుపల్లిలో నూతనంగా ఏర్పాటైన ఏరియాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ ఎమ్మెల్యేను కోరారు. సింగరేణి సంస్థ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ జీఎం శ్రీనివాస్ ను కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జిఎం శ్రీనివాస్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్వీఆర్ ప్రహ్లాద్, డీవైఎస్పీ రవికుమార్, సంక్షేమ అధికారి కె. దేవదాసు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాగమయిను మర్యాద పూర్వకంగా కలిసిన సింగరేణి సత్తుపల్లి జీఎం శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

