Magazines

అందమైన ప్రేమకథ షురూ..

19 నిమిషాల క్రితం

story
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. దర్శకుడు వి.వి.వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా, ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు రవికుమార్ చౌదరి, ఘటికాచలం వద్ద రచయితగా, అసోసియేట్‌గా పనిచేసిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ప్రేమ అంటే రెండు మనసుల మధ్య పుట్టే ఒక అందమైన అనుభూతి. ఆ అనుభూతిని నిజాయతీగా, హృదయానికి హత్తు కునేలా తెరపై చూపించబోతున్నాం’ అని అన్నారు. ‘దర్శకుడు దివాకర్ చెప్పిన కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’ అని నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ చెప్పారు. త్వరలోనే హైదరాబాద్, కేరళలో ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకోనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్