అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘ధర్మన్’. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఆమెను సరికొత్త, ఆకట్టుకునే అవతార్‌లో పరిచయం చేసే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో శ్రీలీ ఆకట్టుకునే అవతార్‌లో కనిపిస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన తార కూడా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు.







కామెంట్‌లు (0)