హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి భిన్న కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది.
అశోక క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3.గా దీన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ఈ చిత్రం బుధవారం ఘనంగా ప్రారంభ మైంది. ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. అనంతరం ముప్పా వెంకయ్య చౌదరి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్ర గంటి రోషన్ మేకను గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ సూపర్‌హీరో అవతార్‌లో చూపిం చేందుకు భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కథను సిద్ధం చేశారు.
ఆసక్తికరమైన కథాంశానికి అత్యా ధునిక సాంకేతికత, భారీ స్థాయి విజువల్స్‌ను జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమాతో బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సినిమాటో గ్రఫీ: పి.జి. విందా, సంగీతం: గౌర హరి, ప్రొడక్షన్ డిజైనర్లు: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే, యాక్షన్ : లీ విటేకర్, రామ కృష్ణ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్.
సరికొత్త సూపర్ హీరో సినిమా
8 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)