Magazines

ఆద్యంతం భిన్నంగా ‘డాన్‌ బాస్కో’

8 నిమిషాల క్రితం

Don Bosco
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

రుష్య ద‌త్తా హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మాణంలో గౌరీ శంకర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బుధవారం మేకర్స్‌ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ‘టీజర్ బాగుంది. ఎంతో వినోదాత్మకంగా సాగింది. శంకర్ చక్కగా హ్యాండిల్ చేశారు. శ్రీచరణ్ బీజీఎం బాగుంది. మిర్నా ప్రతీ పాత్రకు ప్రాణం పోస్తుంటారు. రుష్య నాకు ఫ్యామిలీ మెంబర్. వెంకట్ ఏ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినా సక్సెస్ అవుతుంది. ఈ మూవీతో ఆయనకు మంచి విజయం దక్కాలి’ అని అన్నారు. ‘ఓ మంచి సినిమాతో మీ ముం దుకు రాబోతున్నాం’ అని హీరో రుష్య దత్తా చెప్పారు. నిర్మాత వెంకట్ ఉప్పుటూరి మాట్లాడుతూ, ‘మా టీజర్ నచ్చిం దని భావిస్తున్నాం. మరిన్ని ప్రమో షనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటాం’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్