Magazines

ఛాలెంజింగ్‌ రోల్‌ చేశా..

10 నిమిషాల క్రితం

challenging
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవు తుండగా, అనస్వర రాజన్ కథానా యికగా నటించారు. మహేష్ ఉప్పల దర్శకుడిగా, దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అనీష్ మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు వెంకీకి మా నాన్నతో పరిచయం ఉంది. ఒకసారి ఆయన ఈ కథ గురించి చెప్పారు. అప్పటి నుంచి ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. ఆయన నిర్మాతగా మారితే, నాగార్జున సమర్పకుడిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చిన అంశం ఒక మూగవాడి ప్రేమకథ. తన భావాలను మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి ప్రేమను ఎలా చూపిస్తాడనేది నాకు చాలా నచ్చింది.

అలాగే కథ నడిచే విధానం, హీరో, హీరోయిన్ ప్రయాణం, యాక్షన్, ఎమోషన్ చాలా ఆర్గానిక్‌గా అనిపించాయి. ఇం దులో చాలా ఆసక్తికరమైన సన్ని వేశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలను ఒక మూగవాడు ఎలా ఎదుర్కొంటాడు?, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్ సపోర్ట్ చేయటం ఇప్పటికీ నాకు ఒక కలలాగే అనిపిస్తోంది. వారికి కంటెంట్‌ నచ్చబట్టే ఈ స్థాయి సపోర్ట్‌ లభించిందని భావిస్తు న్నా. దీంతో మాకు సినిమాపై నమ్మకం మరింత పెరిగింది. యాక్షన్‌ను చాలా కొత్తగా డీల్ చేశాం. మీకు సరికొత్త అనుభూతి నిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ మెయిన్ హీరో. ముఖ్యంగా ఇది మూగవాడి కథ కావడంతో సంగీతా నికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తమన్ ఇచ్చిన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందరినీ బాగా అలరిస్తాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్