Magazines

నచ్చితే.. పది మందికి చెప్పండి

6 నిమిషాల క్రితం

Sudheer
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం నేడు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో మంచు మనోజ్‌, నిర్మాత నిరంజన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ,‘చిరంజీవికి ‘ఖైదీ’లా సుడిగాలి సుధీర్‌కు ఈ సినిమా ఉంటుంది. దివ్యభారతి పాత్ర చాలా బాగుంటుంది. మణిశర్మ సంగీతం మా సినిమాని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. కమర్షియల్‌ ఫార్మాట్‌లో చెప్పిన సందేశాత్మక చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు మా కష్టానికి తగిన ప్రతిఫలం విజయం రూపంలో ఇస్తారని నమ్ముతున్నాను' అన్నారు. ‘ఈ సినిమా సుధీర్‌తో పాటు అందరికి మంచి విజయం అందించాలి’ అని మంచు మనోజ్‌ చెప్పారు. హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ,‘ఈ సినిమా చూడండి. నచ్చితే పది మందికి చెప్పండి’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్