అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.
అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో ఎన్టీఆర్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ‘ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమా తోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్‌కి నిదర్శనం. నీ మొదటి సినిమాకే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం చూస్తుంటే, అన్నింటికంటే కథపై నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. నీకు అద్భుతమైన ఆరంభం లభించాలని కోరుకుంటున్నాను బ్రదర్. చిత్ర బృందం మొత్తానికి ఈనెల 13న విడుదల కానున్న మీ సినిమాకు నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
ట్రైలర్ పోలీసుల వేటతో ప్రారంభమవుతుంది. ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు అతడి కోసం పక్కా ప్లాన్ తో గాలిస్తుంటారు. ఈ విచారణలోకి అర్జున్ అనే మూగ యువకుడు ఎంటర్ అవుతాడు. అతను మాట్లాడలేకపోయినా, అసాధారణమైన తెలివితేటలు కలవాడని స్థానికులు చెబుతుంటారు. అద్భుతమైన తెలివితేటలతో పాటు, అర్జున్ మనసులో కీర్తిపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే, కొంతకాలానికే ఈ జంట ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. పోలీసులు, గూండాల ముఠా ఇద్దరి కోసం వేట మొదలు పెడతారు. ఒక మిస్టీరియస్ పెన్‌డ్రైవ్, ఏకంగా రూ.1,000 కోట్ల డీల్.. ఈ ఆసక్తికరమైన వేటకు ప్రధాన కారణాలుగా చూపించిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచిందని మేకర్స్ తెలిపారు.
రూ.వెయ్యికోట్ల డీల్
17 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)