సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్నారు. ఈ జంటపై చంద్రబోస్ క్లాప్ కొట్టారు. ప్రొడ్యూసర్ కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను సైతం ఆయనే అందిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్‌కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాలుగు షెడ్యూల్స్‌లో ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షెడ్యూల్స్ కోనసీమ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ప్రేమ కథా చిత్రం. కుటుంబం మొత్తం ఈ చిత్రాన్ని చూసి హాయిగా ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు అని మేకర్స్ చెప్పారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ - కనుమూరి ప్రసాద్ రాజు, కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: గౌతమ్ ప్రసాద్ యల్లపు, ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం, మ్యూజిక్ - అనూప్ రూబెన్స్, ఎడిటర్ - జే.పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- యర్రంశెట్టి దుర్గాప్రసాద్.







కామెంట్‌లు (0)